Home Page SliderTelangana

ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి పిల్లలకు అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మత్తు మందు అమ్మకాల వార్త హల్ చల్ చేస్తోంది. జూబ్లీహిల్స్ వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ పై జరిపిన దాడుల్లో ఎక్సైజ్ అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి పిల్లలకు అమ్ముతున్నారు. 60 గ్రా. ఐస్ క్రీమ్ లో 100 మి.లీ. విస్కీ కలిపి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ లను పిల్లలు, యువత భారీగా కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోదాలు చేసి వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ యజమానిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నగరంలోని పలు పార్లలలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన విక్రయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ వార్త బయటకు రావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.