NewsTelangana

పెట్టుబడులపేరుతో భారీ మోసాలు

మహనగరంలో మాయగాళ్లు అనే ట్యాగ్ ఈ నిందితులకు చక్కగా నప్పుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నగరాలలో మోసాలు ఎక్కువవుతున్నాయ్. మోసగాళ్లు ప్రజలను దోచుకోవడానికి  అనేక మార్గాలలో వ్యూహాలు తయారు చేస్తున్నారు. అమాయకులైన ప్రజలు చాలా సులువుగా ఈ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ముఠా నుంచి రూ.900 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

ఈ ముఠా పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 10 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు చైనా దేశానికి చెందినవారని సీవీ ఆనంద్ వివరించారు. ఈ ముఠా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా విదేశాలకు పంపినట్లు సీవీ ఆనంద్ చెప్పారు. అయితే మనీ ఎక్స్‌ఛేంజ్ కోసం కౌశిక్ అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ముఠా జిందై టెక్నాలజీస్ ,బిందై టెక్నాలజీస్ పేరుతో ఒక అకౌంటును తెరిచినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ముఠాలో ఉన్న సంజయ్ అనే వ్యక్తికి 15 అకౌంట్లు ఉన్నట్లు సీవీ ఆనంద్ తెలియజేశారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలందరూ  ఈ యాప్స్ వాడే ముందు చాలా అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ ప్రజలకు సూచించారు.