Home Page SliderNational

వాజ్‌పేయ్ పేరుతో కొత్తపార్టీ ప్రారంభించిన మాజీమంత్రి

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త పార్టీ ప్రారంభించారు. మాజీ భారత ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయ్ పేరుతో ఈ పార్టీని ప్రారంభించారు. దీనికి అటల్ విచార్ మంచ్ (ఏవీఎం) అనే పేరు పెట్టారు. ఈ విషయంపై ఆదివారం తన మద్దతు దారులతో కలిసి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించిన యశ్వంత్ సిన్హా వచ్చే ఝార్ఖండ్ ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆయన హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుండి మూడుసార్లు గెలుపొందారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. గతంలో ఐఏఎస్ అధికారి అయిన ఆయన బిహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడం విశేషం. ఆయన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాలలోకి వచ్చానని పేర్కొన్నారు.