పీకల్లోతు కష్టాల్లో మాజీ క్రికెటర్
మాజీ టీమిండియా స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర కష్టాల్లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ, పనిలో క్రమశిక్షణ లేక కెరీర్‌కు దూరమై, తాగుడుకు బానిసై, ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడ్డారు. ఒకప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో సమానంగా, దూకుడుగా ఆడే వినోద్ కాంబ్లి ఇప్పుడు ఇలా ఉండడం చాలా బాధగా ఉందని, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తనకు వచ్చే రూ.30 వేల పెన్షన్‌తో బతుకీడుస్తున్నానని, యూరిన్ సమస్యతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. గతంలో రెండు సర్జరీలు జరిగాయని, వాటికి తన స్నేహితుడు సచిన్ సహాయం చేశారని, ఇప్పుడిప్పుడే తన కుటుంబం సహాయంతో కోలుకుంటున్నానని తెలిపారు. కపిల్ దేవ్ సలహా మేరకు తాను రిహాబిలేషన్ సెంటర్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.