శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది.దీంతో అధికారులు మరో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నిన్న అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో రెండు గేట్లను ఎత్తడంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి చేరుకుంటున్నారు.