డ్రెస్ కోసం కొట్టుకున్నారు..
ఢిల్లీలోని ప్రసిద్ధ సరోజిని నగర్ మార్కెట్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది, దీనిలో ఒకే జత డ్రెస్ కొనడంపై ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టుకున్నారు. ఇద్దరు స్త్రీలు ఒకేలాంటి బట్టలు కొనాలని కోరుకున్నారని చెబుతున్నారు.. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ దృశ్యాన్ని సమీపంలో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.