పవన్‌కు వెండిపూలమాల కానుకిస్తున్న అభిమాని
పవన్ కళ్యాణ్‌పై వీరాభిమానంతో వెండిపూలతో మాలను తయారు చేయించాడు అమలాపురం వాసి. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాడు. దీనిని పవన్ కళ్యాణ్‌కు విజయమాలగా ధరింపజేస్తానని తెలిపాడు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఈ పర్యటనకు ప్రతీ ఊరిలో బ్రహ్మరథం పడుతున్నారు.