తాలిబన్లని రిక్వెస్ట్ చేసిన ప్రముఖ క్రికెటర్
ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన జరుగుతున్న సంగతి తెలిసిందే. వారు స్త్రీలని బయటికి రాకుండా, చదువుకోకుండా నిషేధం విధించిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ తాలిబాన్లకు ఒక రిక్వెస్ట్ చేసారు. అది ఏమిటంటే, “ఆఫ్ఘనిస్తాన్ యొక్క భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది మరియు మహిళలు ఇందులో ముఖ్యమైన భాగం. విద్య అనేది ప్రాథమిక మానవ హక్కు, అటువంటి కీలకమైన రంగాల నుండి మహిళలను నిషేధించడం వెనుకడుగు వేయడమే” అని తన X ఖాతాలో ట్వీట్ చేసారు.