Home Page SliderNational

రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్

టీమిండియా స్టార్ క్రికెటర్ మనోజ్ తివారి క్రికెట్ అన్ని ఫార్మెట్ల  నుంచి రిటైర్ అవుతున్నట్లు తాజాగా ప్రకటించారు. కాగా మనోజ్ తివారి ఇప్పటి వరకు 12 వన్డే మ్యాచ్‌లు ఆడి 287 పరుగులు చేశారు. అయితే ఆయన టీ20ల్లో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఇక IPLలో 98 మ్యాచ్‌లు ఆడి 7 అర్థ శతకాలను సాధించారు. అంతేకాకుండా 98 మ్యాచుల్లో మొత్తం 1695 పరుగులు చేశారు. కాగా మనోజ్ తివారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు.