Home Page SliderTelangana

ఇదేం ఆచారం.. శ్మశానంలో దీపావళి పండుగ

దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఇంటివద్దనే కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలతో పాటు ఏకంగా శ్మశానంలోనూ పండుగ జరుపుకొనే విచిత్రమైన ఆచారం ఉంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను సమాధి చేసిన ప్రదేశంలో దీపాలు వెలిగించి వేడుక చేసుకోవటం ఒక ఆచారంగా నిర్వహిస్తారు. నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం నిన్న దీపావళి పండుగను శ్మశానంలో ఘనంగా జరుపుకున్నారు. పండుగకు వారం రోజుల ముందు శ్మశానవాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. కుటుంబ సభ్యులందరూ సమాధుల వద్దకు వెళ్లి పూలతో సమాధులను అలంకరిస్తారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను సమాధుల వద్ద కూర్చుని అందరం కలిసి తింటామని కుటుంబ సభ్యులు తెలిపారు.