NationalNews Alert

ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్ పోస్ట్

టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మనిషి మంచికి దారితీస్తుంది. సరైన రీతిలో వాడుకోక, దానిని దుర్వినియోగం చేస్తే దాని పరిణామాలు చెడుకు దారితీస్తాయి. ఇన్నాళ్లూ సైబర్ మోసాల గురించి చూస్తూనే ఉన్నాం. కానీ  టెక్నాలజీ వల్ల ఏదైనా మంచి జరిగితే  ఆ  జరిగిన విషయం గురించి కూడా చెప్పుకోవాల్సిందే.

లక్నోకు చెందిన 29 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షలో ఫెయిలయ్యాడు. తీవ్రంగా మనస్థాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. దీనిలో ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు.

దీనితో ఫేస్‌బుక్ రియల్ టైం సాంకేతికత వెంటనే అలెర్ట్ అయి ఆసందేశాన్ని గుర్తించి, పోలీసులకు అప్రమత్తం చేస్తూ మెసేజ్ పెట్టింది. దీనితో రంగంలోకి చేరుకున్న పోలీసులు వెంటనే అతని ఇంటికి చేరుకుని అతనిని రక్షించారు.

క్రుంగుబాటు, ప్రాణహాని పరిస్థితులకు సంబంధించిన పోస్టులు కనిపించినప్పుడు వెంటనే యూపీపోలీసులకు సమాచారం ఇవ్వాలని ఫేస్ బుక్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగానే ఈ విద్యార్థిని కాపాడడం సాధ్యమయ్యిందని పోలీసులు తెలిపారు.