హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఐస్‌క్రీమ్ వ్యాపారం
హైదరాబాద్ నగరంలో చందానగర్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ జోరుగా సాగిపోతోంది. ఐదు సంవత్సరాలుగా ఈ దందా కొనసాగుతోంది. వేసవి కారణంగా ఐస్‌క్రీమ్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నకిలీ ఐస్‌క్రీమ్స్‌కు బ్రాండెండ్ స్టిక్కర్లు వేసి అమ్మడం మొదలుపెట్టారు. ఈ కేంద్రంపై దాడిచేసిన SOT పోలీసులు దాడిచేసి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ 10 లక్షల రూపాయల విలువ గల నకిలీ ఐస్‌క్రీమ్ మెటీరియల్ కూడా లభ్యమయ్యింది. ఈమధ్యనే నకిలీ చాక్లెట్ల వ్యవహారం రాజేంద్రనగర్‌లో వెలుగుచూసింది.

ఇప్పుడు ఈ ఐస్‌క్రీమ్స్ వ్యవహారం కూడా బయటపడింది. నిషేధిత రంగులు, కెమికల్స్ వాడుతూ కేటుగాళ్లు డబ్బు సంపాదిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రంలోనే కాక ఇతరరాష్ట్రాలకు కూడా అమ్మేస్తున్నారు. వీటిలో విషపదార్థాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కేవలం రెండ్రోజుల తేడాతో నకిలీ చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు దొరకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు ఇష్టపడే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.