తప్ప తాగి కారుతో బైకును ఢీకొట్టిన మహిళ.. 14 ఏళ్ల బాలిక మృతి
ఓ మహిళా ఫుల్లుగా మద్యం తాగి అతి వేగంగా కారు నడుపుతూ బైకును ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు మద్యం తాగిన మహిళపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మహిళ మద్యం తాగి కారు నడుపుతున్నట్టు గుర్తించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

