Breaking NewsHome Page SliderNews

48 మంది ప్రాణాలు సేవ్ చేసిన డ్రైవర్

భువనేశ్వర్: బస్సు డ్రైవర్ తనను మృత్యువు వెంటాడుతున్నా లెక్క చేయకుండా గుండెపోటుతోనే బస్సు డ్రైవ్ చేస్తూ మధ్యలో ఇక భరించలేక గోడకు గుద్ది బస్సును ఆపి.. 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. బస్సు నడుపుతున్న టైమ్‌లో డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయన బస్సును రోడ్డు వారగా ఉన్న ఓ గోడకు ఢీకొట్టాడు. దీంతో 48 మంది ప్రాణాలు కాపాడి, ఆపై తాను మరణించాడు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చోటుచేసుకుంది.

బస్సు భువనేశ్వర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌కు గుండెపోటు రావడం.. క్షణాల్లో బస్సును అతడు గోడకు ఢీకొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. డ్రైవర్‌ను దవాఖానాకు తీసుకెళ్లగా అప్పటికే డాక్టర్లు మరణించినట్లు, మరణించిన బాడీని ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. తమ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మరణించడంతో ప్రయాణికులు కంటతడిపెట్టారు.