68 ఫ్లోర్ నుంచి కిందపడి ప్రముఖ సాహసికుడి మృతి
మనలో చాలామందికి స్పైడర్ మ్యాన్,సూపర్ మ్యాన్‌లా పెద్ద పెద్ద భవనాలు ఎక్కి అడ్వెంచర్స్ చేయాలని ఉంటుంది. అయితే వాటిని నిజజీవితంలో చేసేవారు కూడా మనకి అరుదుగా తారసపడుతుంటారు. ఇలా చేసే వారికి పెను ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి భవనాలు ఎక్కి సాహసాలు చేయాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిది. ఇలా చేస్తూ ఓ ప్రముఖ సాహసికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రపంచంలోని ఎత్తైన భవనాలపైకి ఎక్కి సాహసాలు చేస్తూ డేర్ డెవిల్ పేరు గాంచాడు 30 ఏళ్ల రెమి లుసిడి. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇతను తాజాగా హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించాడు. అయితే ఈ సాహసం అతని జీవితంలో విషాదాన్ని నింపింది. కాగా ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ 68 ఫ్లోర్ చేరుకున్న రెమి లుసిడి ప్రమాదవశాత్తు కింద పడి దుర్మణం పాలయ్యాడు. అయితే అతని కాలు పట్టు తప్పడంతోనే అతను కింద పడ్డాడని ఆ బిల్డింగ్‌లో పనిచేసే వర్కర్ ఒకరు వెల్లడించారు.