Home Page SliderTelangana

బాసరలో చిచ్చు పెట్టిన  దళితబంధు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం వికటించింది. చిచ్చు పెట్టింది. దళితులపై సర్పంచ్ దాడి చేశారని ఫిర్యాదు చేశారు దళితులు.  తమకు అనుకూలమైన వారికే, పార్టీకి పనిచేసే వాళ్లకే ఈ పథకం లభిస్తోందనే ఆరోపణలు చేశారు. అదేమని అడిగినందుకు మహిళలపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ప్రకటించిన నాడే ఈ గొడవ జరగడం వివాదాస్పదమయ్యింది. చాలా చోట్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగమవుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.