బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు పంపారని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. రూ.2,500 కోట్లు వసూలు చేసి అధిష్ఠానానికి పంపారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.