Home Page SliderNationalSports

IPL లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు

ఈ IPL సీజన్‌లో కొంతమంది ఆటగాళ్లు తమ ఆటతో దుమ్ములేపుతున్నారు. కాగా వారి ఆటతో ప్రత్యర్థి జట్టులకు గట్టి పోటి ఇస్తున్నారు. అలాంటి ఆటగాళ్లలో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉండడం మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని చెప్పాలి. నిన్న జరిగిన IPL మ్యాచ్‌లో ముంబై ప్లేయర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. దీంతో తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.  కాగా నిన్నటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కష్టమైన ఢిల్లీ పిచ్‌పైనా ఈ తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. అయితే అతను 29 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అంతేకాకుండా 16వ ఓవర్లో 16 పరుగులు చేసి ముంబైపై ఒత్తిడి తగ్గించాడు. అంతకుముందు RCBతో జరిగిన మ్యాచ్‌లోనూ 84 పరుగులు చేశాడు. ఇతడు ఇలానే రాణిస్తే త్వరలోనే టీమిండియా తలుపు తట్టే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మతో కలిసి తిలక్ వర్మ ఇంటర్వ్యూలో   పాల్గొన్నారు.