Home Page SliderInternational

ఆకాశవీధిలో ప్రాణాలకు తెగించి వివాహం చేసుకున్న జంట

తమ వివాహం ప్రత్యేకంగా ఉండాలని ప్రతివారూ కోరుకుంటారు. తలకు మించిన ఖర్చులు పెట్టి వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఒక జంట వివాహం కోసం చేసిన సాహసం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తమ పెళ్లి అయిన వెంటనే ఆకాశంలో స్కైడైవింగ్ చేస్తూ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు ఈ జంట. ప్రిసిల్లా యాంట్, ఫిలిప్పో లక్వెర్స్ అనే జంట తమ వివాహం స్వీట్ మెమరీగా ఉండాలనే కోరితో బంధువుల సమక్షంలో సాహసానికి సిద్ధమయ్యారు. నిపుణుల సహాయంతో చేతులు పట్టుకుని ఎత్తైన కొండ చివరి నుండి స్కైడైవింగ్ చేశారు. ఈ వీడీయోను సోషల్ మీడియాలో పెట్టారు. చాలామంది వీరిద్ధరి ధైర్యాన్ని మెచ్చుకోగా, కొందరు వీరు అతిచేస్తున్నారని, మరికొందరు వీరు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.