పూరీ తీరంలో ఒలింపిక్స్ విజేతల జోడీ
పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యపతకం సాధించిన విజేతల జోడీకి యావత్ భారత దేశం నీరాజనాలు పడుతోంది. సరబ్ జోత్ సింగ్, మను బాకర్ జోడి దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్యాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ సైకత శిల్పి సుద్రర్శన్ పట్నాయక్ పూరీ సాగర తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోంది.


 
							 
							