Home Page SliderNational

రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన  వివాదాస్పద మూవీ

“ది కేరళ స్టోరీ” ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ వివాదాలను ఎదుర్కొంటూ..ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఆదాశర్మ ప్రధాన పాత్రలో..సుదీప్తో సేన్ దర్శకత్వంలో ది కేరళ స్టోరీ తెరకెక్కింది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో  విడుదలైన ఈ సినిమా ఎంతో వేగంగా రూ. 150 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా నిన్నటి వరకు 147.04 కోట్లు వసూలు చేయగా..నేటి కలెక్షన్లతో ఈ ఘనత సాధించినట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కొన్ని రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశనుందని సినీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే మన దేశంలోని పలు రాష్ట్రాలు ఈ సినిమాని నిషేదించినప్పటికీ.. భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.