Home Page SliderInternational

ఉద్యోగులకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్

ప్రతి కంపెనీ ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది. కానీ చైనాలోని ఓ కంపెనీ కాస్త వెరైటీగా ఆలోచించింది. చైనాకు చెందిన హెసన్ మైనింగ్ క్రేన్ కో లిమిటెడ్ అనే సంస్థ ఇలా తన ఉద్యోగుల కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. 70 మీటర్ల పొడవు ఉన్న ఓ టేబుల్ మీద రూ.70కోట్లు పరిచింది. సంస్థలోని ఉద్యోగులను 30 టీంలుగా విభజించింది. అనంతరం ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే ఆ మొత్తం బోనస్ తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఓ ఉద్యోగి అత్యధికంగా రూ.12.07 లక్షలు లెక్కించినట్లు తెలిసింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.