Home Page SliderTelangana

కారు డ్రైవర్ నిర్లక్ష్యపు చర్యకు చిన్నారి బలి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యపు చర్య బాలిక ప్రాణాలను బలి తీసుకుంది. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న తొమ్మిదేళ్ల చిన్నారి బాణోతు ఇంద్రజ వధూవరులు ఎక్కిన కారులో వెనుక సీటులో కూర్చుని కిటికి నుండి తల బయటపెట్టి బయట జరుగుతున్న పెళ్ల బారాత్ డ్యాన్సులు చూస్తోంది. ఈ సంగతి గమనించని డ్రైవర్ డోర్ అద్దం బటన్ నొక్కాడు. బారత్ సౌండ్‌లో దీనిని ఎవరూ గమనించలేదు. పాపం ఇంద్రజ మెడ అందులో ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయింది. చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.