రేవతి కుటుంబానికి 50 లక్ష రూపాయల చెక్కు అందజేత
సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి పుష్ప 2 సినిమా నిర్మాత నవీన్ యేర్నేని రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను మంత్రి కోమటి రెడ్డితో కలిసి నిర్మాత నవీన్ యేర్నేని పరామర్శించారు. 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ కు అందజేశారు. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని సూచించారు. సినిమా హీరోల ఇండ్లపై దాడులు చేయకూడదని అన్నారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదని.. ఈ పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు.. ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతాం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.