Home Page SliderTelangana

రోడ్డు ప్రమాదంలో సిమెంట్ లారీ దగ్ధం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిమెంట్ లారీకి మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధం అయింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. కోదాడ మండలం దోరకుంట వద్ద నేషనల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.