సీఎం జగన్‌పై కేసు పెట్టాలి :చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసు పెట్టాల్సీ వస్తే సీఎం జగన్‌పైనే పెట్టి విచారణ జరపాలని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలోని వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే వారు పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం కేసు పెట్టారు. అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిలేని,నీతిమాలిన చర్య అని చంద్రబాబు అన్నారు. కాగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? ఏపీలో ప్రజల కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు. పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం.కేసు పెట్టాల్సి వస్తే ముందుగా సీఎం జగన్‌పైనే కేసు పెట్టి విచారణ జరపాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.