నయనతార దంపతులపై కేసు నమోదు
లేడి సూపర్‌స్టార్ నయనతార,విఘ్నేష్ శివన్ దంపతులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కాగా గతంలో సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారు మరో వివాదంలో చిక్కుకోవడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు తమ ఉమ్మడి ఆస్తిని మోసపూరితంగా ఇతరులకు అమ్ముకున్నాడంటూ ఆయన సోదరులు ఆరోపించారు. ఈ మేరకు వారు విఘ్నేశ్, నయన్‌తోపాటు వారి కుటుంబీకులపై తిరుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.