Home Page SliderTelangana

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డిపై కేసు నమోదు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌కి ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపుతోంది. మొత్తం వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ రచ్చకు కారణమవుతోంది. వెంకట్ రెడ్డి.. ఫోన్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ రాజకీయాలు భగ్గమన్నాయి. వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌కు పార్టీ నేతలు అనేక మంది కంప్లైంట్ కూడా చేశారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని.. చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుహాస్, ఫిర్యాదుతో పోలీసులు, వెంకట్ రెడ్డిపై 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం వెంకట్ రెడ్డిపై సుహాస్ ఫిర్యాదు చేశారు.