మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. కాగా ఆయనపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితోపాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్,గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై సెక్షన్ 447,506,R/W ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.