మాలీవుడ్‌లో దుమారం రేపిన హేమ కమిటీ-దర్శకుడిపై కేసు నమోదు
మలయాళ చిత్రసీమలో హేమ కమిటీ నివేదిక పెనుదుమారం రేపింది. ప్రముఖ దర్శకుడు రంజిత్‌పై కేసు నమోదయ్యింది. కేరళ చిత్రసీమలో మహిళల పరిస్థితిపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. పెద్దమనుషుల ముసుగులో ఉన్న తోడేళ్లు బయటకు వస్తున్నాయి. 2009లో దర్శకుడు రంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఒక బెంగాలీ నటి ఆరోపణలపై స్పందించి కోచి పోలీసు కమిషనర్ దర్శకుడు రంజిత్‌పై కేసు నమోదు చేశారు. “పలేరి మాణిక్యం” అనే చిత్రం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు చాలా తన చేతులను, మెడను తాకారని, చాలా ఇబ్బందిగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో చాలా భయపడి రాత్రంతా హోటల్ రూమ్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపానని ఆమె వెల్లడించారు. అప్పటి నుండి మలయాళీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ఈ ఆరోపణలను దర్శకుడు రంజిత్ అంగీకరించలేదు. సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలు వేస్తోందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆయన మూవీ అసోషియేషన్ పదవికి రాజీనామా చేశారు.

