సీఎంపై కేసు నమోదు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. హైదరాబాద్ల్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. గత మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజం లేనప్పటికీ ప్రజల్లో పార్టీపై అపనమ్మకం ఏర్పడిందన్నారు. పరువు నష్టం కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసిందని కాసం వెంకటేశ్వర్లు తరుఫున కోర్టుకు హాజరైన న్యాయవాది హంసా దేవినేని అన్నారు. సీఎం కోర్టుకు ఎప్పుడు రావాలన్న విషయాన్ని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

