రోడ్డు పై వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు
రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జరిగింది. తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో గుద్ది సతీశ్ అనే వ్యక్తి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించాడు. బైక్ పై వెళ్తున్న మురళిని కారులో వేగంగా వచ్చి సతీష్ ఢీకొట్టాడు. అయితే.. మురళిని ఢీ కొడుతున్న సమయంలో అటుగా నడిచి వెళ్తున్న ఓ మహిళను కూడా కారుతో సతీష్ ఢీకొట్టాడు. కారుతో ఢీకొట్టడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా మహిళ వేలాడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.