ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు… యువకుడికి తీవ్రగాయాలు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు 15 మీటర్ల మేర ఎగిరి ఎదురుగా ఉన్న ఆటోకు తాకి కిందపడ్డారు. ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగి వెంటనే కారు డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి కారును ఆపకుండానే ఉడాయించాడు. ప్రమాదంలో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధిన వీడియో అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.