Andhra PradeshHome Page SliderNational

ఫుట్‌పాత్‌పై నడుస్తున్న 5 మందిని గుద్దిన కారు.. మహిళ మృతి

ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్..

బెంగళూరు: ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురిపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి. ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు లేడీహిల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు నడుస్తూ పోతున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు వారిమీద నుండి పోయింది. దీంతో వారంతా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా గుర్తించారు. మరో మహిళ, ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.

  కాగా, ఈ ఘటన అనంతరం కారు డ్రైవ్ చేసిన కమలేష్ బల్దేవ్ వద్ద ఒక కార్ షోరూమ్ ముందు తన కారును పార్క్ చేసి ఇంటికి పోయినాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీ టీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.