Home Page SlidermoviesNational

ఫైర్ ఎగ్జిట్ నుండి సైఫ్ ఇంట్లోకి దొంగ

గత రాత్రి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగ సైఫ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాదాల సమయంలో వాడే మెట్ల మార్గంలో దొంగ ఇంట్లోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజ్‌లో తేలింది. సైఫ్ ఇంటిలోని పనివారిని ఇప్పటికే పోలీసులు విచారించారు. అతడి దొంగతనం కోసమే వచ్చాడని భావిస్తున్నామని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ హౌసింగ్ సొసైటీలో కొన్నిచోట్ల ఇళ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. దీనితో బయట నుండి కూడా పనివారు వచ్చి పోతున్నారు. సైఫ్ అలీఖాన్ వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో అక్కడ శస్త్రచికిత్స చేసి, 2.5 అంగుళాల కత్తి ముక్కను అక్కడ నుండి తొలిగించారు.