Home Page SliderNational

ఇది “గేదే” తీర్చిన పంచాయితీ

గ్రామంలో ఎవరి మధ్యనైనా గొడవలు వస్తే సాధారణంగా పంచాయితీ పెద్దలు వాళ్ల సమస్యను పరిష్కరిస్తారు. అయితే యూపీలోని ఓ గ్రామంలో ఇద్దరి మధ్య పంచాయితీని ఓ గేదే తీర్చేసి ఔరా అనిపించింది. కాగా ఈ ఘటన యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. ప్రతాప్‌గఢ్‌లో నందలాల్‌కు చెందిన గేదే తప్పిపోయింది. అయితే ఆ గేదేను హనుమాన్ అనే వ్యక్తి తన ఇంట్లో కట్టేసుకుని నందలాల్‌కు తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. దీంతో నందలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నందలాల్,హనుమాన్ రోడ్డుకు ఇరువైపులా వెళ్లి గేదేను పిలవాలని..ఆ గేదే ఎవరి వైపు వస్తే వారిదే అని పోలీసు అధికారి తెలిపారు.  ఈ నేపథ్యంలో గేదే తన యజమాని నందలాల్ వైపే వెళ్లింది. దీంతో నందలాల్,హనుమాన్ మధ్య పంచాయితీ ముగిసింది.