తెలంగాణ భవన్ వద్ద గొడవ చేసిన ఓ కుర్రాడు
ఓ కుర్రాడు తెలంగాణ భవన్ చేరుకుని అక్కడ ఉన్న సిబ్బందితో గొడవ చేశాడు. తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తున్నారని తెలిసి.. ఆయన్ను కలిసేందుకు ఓ అబ్బాయి వచ్చాడు. తాను ఉదయం వస్తే గేటు వద్దే ఆపేశారని, లోనికి వెళ్లనివ్వడం లేదని.. తనపై న్యూసెన్స్ చేస్తున్నారని ఆ అబ్బాయి ఆవేదన చెందాడు. చివరికి.. లోపలి నుంచి పిలుపురావడంతో, కుర్రాడిని అధికారులు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.