షూటింగ్‌లో బాంబు పేలి..ప్రముఖ నటుడికి గాయాలు
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. కాగా ఈ రోజు బెంగుళూరులోని మాగడి రోడ్డు ప్రాంతంలో జరుగుతున్న కేడీ సినిమా షూటింగ్‌లో సంజయ్ పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో బాంబ్ బ్లాస్ట్ ఫైట్ సన్నివేశాలను చిత్రబృందం షూట్ చేస్తుంది. ఆ సమయంలో ఒక్కసారిగా బాంబ్ పేలడంతో సంజయ్ దత్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సంజయ్ దత్ మోచేయి,ముఖం,తలకు గాయలయ్యినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు బెంగుళూరులోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అయితే ప్రథమ చికిత్స అనంతరం సంజయ్ దత్ ముంబయికి వెళ్లిపోయినట్లు సమాచారం.