Breaking NewsHome Page SliderInternationalNationalSports

టీమిండియాకు ఎదురు దెబ్బ‌

చాంపియ‌న్స్ ట్రోపీకి ముందే టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ప్రధాన బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న మోర్నే మోర్కెల్, జట్టును వీడి తన స్వదేశం సౌతాఫ్రికాకు వెళ్లిపోయాడు. మోర్కెల్‌ తండ్రి మరణించడంతో అతను టీమిండియాను వీడాల్సి వచ్చింది.ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం టీమిండియాతో కలిసి దుబాయ్‌ వెళ్లిన మోర్కెల్‌, ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. కానీ, సోమవారం మాత్రం అతను టీమ్‌తో కనిపించలేదు. తండ్రి మరణ వార్త తెలియగానే, బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొని, హుటాహుటిన దుబాయ్‌ నుంచి సౌతాఫ్రికాకు వెళ్లిపోయాడు. ఈ దుఃఖ సమయంలో బీసీసీఐ మోర్కెల్‌కు అండగా నిలుస్తూ.. వెంటనే అతని ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అయితే మోర్కెల్‌ ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ బాధ నుంచి అతను బయటపడి, టీమిండియాతో మళ్లీ జత కలవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఎందుకంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో జట్టుతో పాటు ప్రధాన కోచ్‌ లేకపోతే, బౌలర్లను టోర్నీకి ట్రైన్‌ చేయడం కష్టంగా మారుతోంది. ఇది హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌పై ఒత్తిడిని పెంచేలా మారింది.