రంజీ చరిత్రలో బ్లాక్ బస్టర్ రికార్డు
అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ చరిత్రలో తిరుగులేని రికార్డు నెలకొల్పారు గోవా బ్యాటర్లు. కశ్యప్ బాక్లే 300 పరుగులు, స్నేహాల్ కౌతాంకర్ 314 పరుగులతో కలిసి 606 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంత అత్యధిక పరుగులు రంజీ ట్రోఫీ చరిత్రలోనే రికార్డుగా మారాయి. దీనితో గోవా 727 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే అరుణాచల ప్రదేశ్ కేవలం 88 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం.
మరోపక్క రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున మధ్యప్రదేశ్‌తో ఆడుతున్న స్టార్ బౌలర్ షమీ ఈ రోజు మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 9 ఓవర్లు వేసి, 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.