హైకోర్టులో సిద్దరామయ్యకు భారీ ఊరట
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ స్కామ్ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయననును విచారించడానికి గవర్నర్ థాపర్ చంద్ అనుమతించడంపై సిద్దరామయ్య హైకోర్టులో సవాలు చేశారు. ఈ అనుమతి చట్ట విరుద్ధం అని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. దీనితో తదుపరి విచారణ జరిగి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోరాదని, లోకాయుక్తను హైకోర్టు ఆదేశించింది. సీఎంను విచారించేందుకు అనుమతిని వాయిదా వేసింది.