ఆతిశీకి కోర్టులో ఊరట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదైన పరువునష్టం కేసును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు దాఖలు చేసిన ఈ కేసులో ఆమె పార్టీని ఉద్దేశించి మాట్లాడారని, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించలేదని న్యాయస్థానం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆమె బీజేపీ పార్టీలో చేరకపోతే ఈడీ ఆప్ నేతలను అరెస్టు చేస్తుందని కాషాయ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కల్కాజీ స్థానం నుండి సీఎం ఆతిశీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.