సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న బ్యాంక్ ఉద్యోగి
సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఉద్యోగి సైతం వదలలేదు. సైబర్ ట్రాప్ కి బ్యాంకు ఉద్యోగి బలయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి లక్షా 15 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు అకౌంట్ వివరాలను ఎలా సంపాదించారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.