NationalNewsTrending Today

70 ఏళ్ళ వ్యక్తి కడుపులో 6 వేల రాళ్ళు…

రాజస్థాన్‌లోని 70 ఏళ్ళ వ్యక్తి శరీరంలో 6 వేల రాళ్లు ఉండడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఆరోగ్యం సరిగా లేక మూడు రోజుల క్రిందట ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే అతను సోనోగ్రఫీ చేయించుకోగా అతని పిత్తాశయం 12×4 సెంటీ మీటర్ల పరిణామంతో 6,110 రాళ్ళతో నిండిపోయి ఉంది. దీంతో వైద్యులు లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా ఎండోబ్యాగ్‌ని ఉపయోగించి వాటిని పిత్తాశయం నుంచి తీసేసారు. 30- 40 నిమిషాల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్స చేయడం సవాలుగా మారిందని వైద్యులు తెలిపారు.