చెస్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 5ఏళ్ల బుడతడు
భారతదేశానికి చెందిన 5ఏళ్ల బాలుడు చెస్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించి సత్తా చాటాడు. కాగా మన దేశంలోని ఉత్తరాఖండ్‌కు చెందిన తేజస్ తివారి అనే 5ఏళ్ల కుర్రాడు చిన్న వయస్సులోనే ఫిడే రేటింగ్(1149) సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఈ బుడతడు 4ఏళ్లకే జిల్లా,రాష్ట్ర స్థాయిలో చెస్ ఆడాడు. కాగా ఈ బాలుడు అతి పిన్న వయస్సులోనే దాదాపు 13 రాష్ట్రాల్లో జరిగిన చెస్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఉత్తారఖండ్‌లో జరిగిన టోర్నీలో అండర-8 కేటగిరో విజేతగా నిలిచాడు. దీంతోపాటు భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ పాఠశాల చెస్‌లో తేజస్ తివారి ట్రోఫి గెలుపొందాడు. కాగా 5ఏళ్లకే చెస్‌లో ఆరితేరి ప్రపంచ రికార్డ్ సృష్టించిన తేజస్ తివారికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.