యూపీలో..బోరుబావిలో పడిన 4 ఏళ్ల బాలుడు
భారత దేశంలో బోరు బావులు చిన్నారుల పాలిట యమపాశంగా మారాయి. అభం శుభం తెలియని పసిపిల్లలను ఈ బోరు బావులు అమాంతం మింగేస్తున్నాయి. అంతేకాకుండా కన్నవాళ్లకు కడుపు శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో ఎంతో మంది చిన్నారులు బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలు మరువక ముందే దేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. యూపీలో ఓ నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో జారి పడిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బాలుడిని రక్షించేందుకు ప్రమాదం జరిగిన ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నాయి. ప్రస్తుతం వారు బాలుడిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే బాలుడు ఓ 50 అడుగుల లోతు బోరు బావిలో పడ్డట్లుగా వారు గుర్తించారు. కాగా యూపీలోని హాపూర్ జిల్లా కోట్లసాదత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.