Home Page SliderNational

20 ఏళ్ల విద్యార్థిని స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ..

ఓ కళాశాలలో 20 ఏళ్ల విద్యార్థిని స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర – ధారాశివ్ జిల్లా లో చోటు చేసుకుంది. కళాశాల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ బీఎస్సీ విద్యార్థిని వర్షా ఖరాత్(20) కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. అయితే.. ఎనిమిదేళ్ల వయసులో వర్ష గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె ఇలా మృతి చెందడంతో తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు. దీంతొ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.