News

ప్రిన్సిపల్ తిట్టాడని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

ప్రిన్సిపల్ తిట్టాడని పాఠశాల భవనం పై నుండి దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రైవేట్ స్కూల్ లో చోటు చేసుకుంది. ఆ విద్యార్థి బీజేపీ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడు నీరజ్ గా గుర్తించారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నీరజ్ మరో విద్యార్థి బాల్కనీలో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించడంతో మనస్థాపానికి గురై టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి అక్కడే భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తు నుండి నీరజ్ దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్కూల్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.