లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి
రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 17వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ తోట గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు. అసలేం జరిగిందంటే.. కమాండెంట్ తోట గంగారాం తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ వెళ్లాడు. డిన్నర్ చేశాక లిఫ్ట్ దగ్గర వెయిట్ చేశాడు. లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫోర్ లో ఉన్న లిఫ్ట్ పై గంగారాం పడిపోయారు. దీంతో ఆయనకి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతునికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారాం మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

