Home Page SliderTelangana

స్కూల్లో తెగిపడ్డ లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు

హైదరాబాద్ లోని ఓ స్కూల్ లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి కుప్పకూలింది. అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో 1st ఫ్లోర్లో వైర్ కట్ అయ్యి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ పడిపోయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. లిఫ్ట్ లో 13 మంది ఉన్నారు. ఓవర్ లోడ్ తో లిఫ్ట్ తెగి పడినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.